క్షిపణి ప్రయోగం ప్రమాదవశాత్తూ జరిగిందే భారత్‌కు అమెరికా మద్దతు

ABN , First Publish Date - 2022-03-16T08:07:53+05:30 IST

భారత క్షిపణి పాకిస్థాన్‌లో పడటమనేది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప కావాలని చేసిందనడానికి ..

క్షిపణి ప్రయోగం ప్రమాదవశాత్తూ జరిగిందే  భారత్‌కు అమెరికా మద్దతు

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మార్చి 15: భారత క్షిపణి పాకిస్థాన్‌లో పడటమనేది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప కావాలని చేసిందనడానికి ఎలాంటి సూచనలు లేవని అమెరికా తాజాగా అభిప్రాయపడింది. ఈ నెల 9న భారత క్షిపణి పాకిస్థాన్‌ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఈ అంశంపై మాట్లాడుతూ భారత్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘మా భారత భాగస్వాములు చెబుతున్నట్లుగా ఇది ప్రమాదవశాత్తూ జరిగిందే తప్ప ఇంకొకటి కాదు. క్షిపణి ఎందుకు ఫైర్‌ అయిందో భారత్‌ ఇప్పటికే వి వరణ ఇచ్చింది. ఇంతకుమించి మేము కూడా ఏమీ మాట్లాడలేం’’ అన్నారు.   

Updated Date - 2022-03-16T08:07:53+05:30 IST