యాసిన్ మాలిక్‌కు యావజ్జీవం

ABN , First Publish Date - 2022-05-25T23:49:50+05:30 IST

ఢిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాలా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవం

ఢిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసుల్లో దోషిగా తేలిన కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాలా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. వాస్తవానికి యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని ఎన్‌ఐఏ కోర్టుకు సూచించింది. అయినా న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. చివరి శ్వాస వరకూ జైల్లోనే ఉంచాలని తీర్పు వెలువరించారు. 


కశ్మీర్‌లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో మాలిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడు. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడు. ఈ కేసుల్లో యాసిన్ మాలిక్‌తో పాటు లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్ పేర్లు కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి. 


తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ యాసిన్ మాలిక్ మే పదో తేదీన కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు. 


మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ, కశ్మీర్‌లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.Updated Date - 2022-05-25T23:49:50+05:30 IST

Read more