రూ.5 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ!

ABN , First Publish Date - 2022-12-13T02:54:27+05:30 IST

వచ్చే కేంద్ర బడ్జెట్‌ (2023-24)పై కసరత్తు ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌ను జనాకర్షణీయంగా తీర్చిదిద్దాలని మోదీ సర్కార్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్‌లో ప్రకటించిన

రూ.5 లక్షల వరకు ట్యాక్స్‌ ఫ్రీ!

పరిశీలిస్తున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రతిపాదించే వీలు

న్యూఢిల్లీ: వచ్చే కేంద్ర బడ్జెట్‌ (2023-24)పై కసరత్తు ప్రారంభమైంది. ఈ బడ్జెట్‌ను జనాకర్షణీయంగా తీర్చిదిద్దాలని మోదీ సర్కార్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా 2020-21 బడ్జెట్‌లో ప్రకటించిన ‘ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను’ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విధానంలో రూ.2.5 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారిపై ఎలాంటి పన్ను లేదు. దీన్ని రూ.5 లక్షల వరకు పెంచే విషయంపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. దీనివల్ల చాలా మందిపై పన్ను పోటు తగ్గి, పెట్టుబడులకు అవసరమైన నిధులు మిగులుతాయని భావిస్తున్నారు.

ఎందుకంటే ?

‘ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను’ విధానంపై పన్ను చెల్లింపుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత రెండేళ్ల ట్యాక్స్‌ రిటర్న్‌లను చూస్తే కేవలం 10-12 శాతం మంది మాత్రమే దీన్ని ఎంచుకున్నారు. మిగతా వారంతా పాత పన్ను చెల్లింపు విధానం కిందే ఆదాయ పన్ను రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీలను ఉపయోగించుకుంటే పాత పద్దతిలో పన్ను పోటు తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. దీంతో ‘ప్రత్యామ్నాయ వ్యక్తిగత ఆదాయ పన్ను’ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పన్ను మినహాయింపు వార్షిక ఆదాయ పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచే విషయాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2022-12-13T02:54:28+05:30 IST