రాష్ట్రంలో కొత్తగా 20 Arts and Science కళాశాలలు

ABN , First Publish Date - 2022-07-08T13:35:09+05:30 IST

రాష్ట్రంలో తాత్కాలిక భవనసముదాయాలలో ఏర్పాటైన 20 కొత్త ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు.

రాష్ట్రంలో కొత్తగా 20 Arts and Science కళాశాలలు

- రూ.152 కోట్లతో కొత్త భవనాలు  

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తాత్కాలిక భవనసముదాయాలలో ఏర్పాటైన 20 కొత్త ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. శాసనసభలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉన్నతవిద్యాశాఖ ఆర్థిక పద్దులపై జరిగిన చర్చల సందర్భంగా మంత్రి పొన్ముడి రాష్ట్రంలో కొత్తగా పది ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు తిరుచ్చుళి, తిరుకోవిలూరు, తాళవాడి, ఒట్టన్‌సత్తిరం, మానూరు, తారాపురం, ఏరియూరు, ఆలంగుడి, కూత్తానల్లూరు, సేర్కాడు ప్రాంతాల్లో ఈ కళాశాలలను ప్రారంభిస్తామని తెలిపారు. అదే విధంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి శాసనసభలో ఉన్నతవిద్యాశాఖ ఆర్థిక పద్దులపై జరిగిన చర్చల సమయంలో ఆయన మాట్లాడుతూ మనప్పారై, సెంజి, థళి, తిరుమయం, అందియూరు, అరవకురిచ్చి, తిరుకాట్టుపల్లి, రెడ్డియార్‌ సత్రం, వడలూరు, శ్రీపెరుంబుదూరులో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. శాసనసభలో ప్రకటించినట్లు ఆ ఇరవై ప్రాంతాల్లో తాత్కాలిక భవనసముదాయాలలో కొత్త ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఈ కళాశాలలను సచివాలయంలో గురువారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రారంభించారు.  అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో రూ.152 కోట్ల వ్యయంతో నిర్మించిన కళాశాలలు, విద్యాసంస్థల భవనాలకు కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఆ మేరకు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో రూ.1.60 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, ప్రయోగశాలలు, స్థానిక లేడీ వెలింగ్టన్‌ విద్యా సంస్థలో రూ.1.69 కోట్ల వ్యయంతో అదనపు తరగతి గదులు, ప్రయో ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, సామినాధన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డి. కార్తికేయన్‌, సాంకేతి విద్యా శాఖ సంచాలకులు లక్ష్మీప్రియ, కళాశాలల విద్యాశాఖ సంచాలకులు ఎం. ఈశ్వరమూర్తి పాల్గొన్నారు.

Read more