స్వధర్మ వాహిని సంస్థకు సహకరించాలి

ABN , First Publish Date - 2022-09-13T09:37:33+05:30 IST

స్వధర్మ వాహిని సంస్థకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కోరారు.

స్వధర్మ వాహిని సంస్థకు సహకరించాలి

నిర్మలా సీతారామన్‌ను కోరిన స్వాత్మానందేంద్ర

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్వధర్మ వాహిని సంస్థకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కోరారు. సోమవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసారు. స్వధర్మ వాహిని సంస్థ ద్వారా శారదాపీఠం చేపట్టనున్న ధర్మ ప్రచారం గురించి కేంద్రమంత్రికి స్వాత్మానందేంద్ర వివరించారు. ఈనెల 26వ తేదీ నుంచి పీఠం నిర్వహించనున్న రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు.  ఢిల్లీలో స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని పలువురు ఉన్నతాధికారులు కలిసారు.

Read more