భారత్‌ జోడో యాత్ర ట్విటర్‌ ఖాతాల నిలుపుదల

ABN , First Publish Date - 2022-11-08T02:47:49+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ, భారత్‌ జోడో యాత్రల ట్విటర్‌ ఖాతాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ బెంగళూరులోని కమర్షియల్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

భారత్‌ జోడో యాత్ర ట్విటర్‌ ఖాతాల నిలుపుదల

బెంగళూరు, నవంబరు7: కాంగ్రెస్‌ పార్టీ, భారత్‌ జోడో యాత్రల ట్విటర్‌ ఖాతాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ బెంగళూరులోని కమర్షియల్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన పాటలకు కేజీఎఫ్‌-2 చాప్టర్‌లోని పాటల సౌండ్‌ రికార్డులను కాపీ కొట్టారంటూ ఎంఆర్‌టీ మ్యూజిక్‌ సంస్థ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకొంది. దీనిపై కాంగ్రెస్‌ స్పందిస్తూ కోర్టులో జరిగిన విచారణ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొంది.

Updated Date - 2022-11-08T02:47:49+05:30 IST

Read more