కులగణనపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2022-11-03T04:35:33+05:30 IST

జనగణనలో భాగంగా కులాలవారీగా బీసీల లెక్కలను సేకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది.

కులగణనపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జనగణనలో భాగంగా కులాలవారీగా బీసీల లెక్కలను సేకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైసీపీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఈ పిటిషన్‌ను దాఖలుచేశారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కాసోజు మహేశ్‌చారి వాదనలు వినిపిస్తూ 1931లో బీసీల జనాభా లెక్కలు సేకరించారని, ప్రస్తుతం వాటి ఆధారంగానే రిజర్వేషన్ల కల్పిస్తున్నారని తెలిపారు. దీనివల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ఆరు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Updated Date - 2022-11-03T04:35:34+05:30 IST