ఆఫ్‌లైన్‌ పరీక్షల రద్దుపై సుప్రీంలో నేడు విచారణ

ABN , First Publish Date - 2022-02-23T08:00:22+05:30 IST

సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, స్టేట్‌ బోర్డులు ప్రకటించిన ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో ...

ఆఫ్‌లైన్‌ పరీక్షల రద్దుపై  సుప్రీంలో నేడు విచారణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సీబీఎ్‌సఈ, ఐసీఎ్‌సఈ, స్టేట్‌ బోర్డులు ప్రకటించిన ఆఫ్‌లైన్‌ పరీక్షలను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారంనాడు విచారణ జరగనుంది.  కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలను రద్దుచేయాలని కోరుతూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుప్రీంలో పిటిషన్‌ దాఖలుచేశారు. కరోనా నేపథ్యంలో క్లాసులు పూర్తి స్థాయిలో జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్‌ ఖన్విల్కర్‌ నేతృత్వంలోని జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. 

Read more