నొప్పి లేకుండా షుగర్‌ చూసుకోవచ్చు!

ABN , First Publish Date - 2022-10-08T08:57:23+05:30 IST

మధుమేహ బాధితులు నిత్యం ఎదుర్కొనే రెండు ప్రధాన సమస్యల్లో ఒకటి షుగర్‌ చెక్‌ చేసుకోవడం.

నొప్పి లేకుండా షుగర్‌ చూసుకోవచ్చు!

రక్తంలో చక్కెర స్థాయులను 

90% కచ్చితత్వంతో గుర్తించే పరికరం

అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రజ్ఞులు


న్యూయార్క్‌, అక్టోబరు 7: మధుమేహ బాధితులు నిత్యం ఎదుర్కొనే రెండు ప్రధాన సమస్యల్లో ఒకటి షుగర్‌ చెక్‌ చేసుకోవడం. రెండోది ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌. రక్తంలో చక్కెర స్థాయులు తెలుసుకోవడానికి రోజూ చిన్నపాటి సూదిలాంటి పరికరంతో వేలిపై పొడిచి, రక్తపు బొట్టు గ్లూకోమీటర్‌ స్ట్రిప్‌పై వేయాల్సి ఉంటుంది! చిన్నప్పుడు తన తండ్రి రోజూ ఇలాగే షుగర్‌ చెక్‌ చేసుకుని బాధపడుతుండడం చూసిన మరియా వాలెరో అనే శాస్త్రవేత్త.. అలాంటి బాధ ఇతరులు పడకుండా ఉండేలా ‘గ్లూకోచెక్‌’ అనే కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు. జార్జియా (అమెరికా)లోని కెన్నెసా స్టేట్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌ (సీసీఎ్‌సఈ)కి చెందిన వాలెరో, ఆమె బృందం తయారుచేసిన ఈ పరికరాన్ని వేలికి తగిలించుకుంటే చాలు 90ు కచ్చితత్వంతో రక్తంలో చక్కెర స్థాయులను తెలుపుతుంది. ట్రయల్స్‌లో భాగంగా 50 మంది మీదే పరీక్షించినందున.. ఈ పరికరానికి ప్రొవిజనల్‌ పేటెంట్‌ కోసం వాలెరో ఇటీవలే దరఖాస్తు చేశారు. పూర్తిస్థాయి పేటెంట్‌ కోసం దరఖాస్తు చేయాలంటే రకరకాల చర్మాలపై దీని పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మొబైల్‌ యాప్‌ను కూడా వాలెరో బృందం రూపొందించింది. అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సాతో కూడా దీన్ని అనుసంధానం చేసే ప్రయత్నాల్లో ఉంది.

Updated Date - 2022-10-08T08:57:23+05:30 IST