Sub Collector: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2022-12-30T10:34:40+05:30 IST

నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని పొన్నేరి సబ్‌ కలెక్టర్‌ ఐశ్వర్య రామనాధన్‌(

Sub Collector: ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

గుమ్మిడిపూండి(చెన్నై), డిసెంబరు 29: నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని పొన్నేరి సబ్‌ కలెక్టర్‌ ఐశ్వర్య రామనాధన్‌(Sub Collector Aishwarya Ramanadhan) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరువళ్లూర్‌ జిల్లా పొన్నేరిలో గురువారం ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేలా నిర్వహించిన మోటార్‌ సైకిల్‌ ర్యాలీని సబ్‌ కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో నిబంధనలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో మోటారు వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ కరుపయ్య, రాజేశ్వరి, ఆర్‌ఐ మార్టిన్‌ ఇన్బరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T10:34:42+05:30 IST