Student: రోడ్డు పక్కన దొరికిన నగదు

ABN , First Publish Date - 2022-12-09T08:56:45+05:30 IST

రోడ్డు పక్కన దొరికిన నగదును పోలీస్ స్టేషన్‌(Police station)లో అప్పగించిన విద్యార్థినులను నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ అభినందించారు.

Student: రోడ్డు పక్కన దొరికిన నగదు

- పోలీసులకు అప్పగించిన విద్యార్థినులు

- అభినందించిన నగర పోలీస్‌ కమిషనర్‌

పెరంబూర్‌(చెన్నై), డిసెంబరు 8: రోడ్డు పక్కన దొరికిన నగదును పోలీస్ స్టేషన్‌(Police station)లో అప్పగించిన విద్యార్థినులను నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ అభినందించారు. కొరుక్కుపేట కార్నేశన్‌ నగర్‌లో ‘చెన్నై మాధ్యమిక పాఠశాల’లో రాధిక, నిషా, ఏంజల్‌, కావ్య 5వ తరగతి చదువుతున్నారు. గత నెల 28న పాఠశాల తరువాత ఇంటికి నడచి వెళుతుండగా రామస్వామి వీధిలోని ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన ఓ మినీ పర్సు పడి ఉండడం గుర్తించారు. ఆ పర్సులో చూడగా అందులో రూ.7,705 నగదు చూసి వెంటనే వారు ఆ పర్సును ఆర్‌కే నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు. వారిని అభినందించిన పోలీసులు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి పంపించారు. ఈ నేపథ్యంలో, ఈ విషయం తెలుసుకున్న నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జివాల్‌ బుధవారం విద్యార్థులను తన కార్యాలయానికి పిలిచి అభినందించి చాక్లెట్లు, బిస్కెట్లతో పాటు రూ.1,000 నగదు, మధ్యాహ్న భోజనం పెట్టి వారిని మళ్లీ భద్రంగా ఇంటికి పంపారు.

Updated Date - 2022-12-09T08:56:47+05:30 IST