అమెరికా-రష్యా అణుయుద్ధంతో ఆకలి విలయమే

ABN , First Publish Date - 2022-08-17T06:50:53+05:30 IST

అమెరికా దగ్గర ఐదు వేలకు పైగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి! రష్యా దగ్గర అంతకు మించి.. అంటే ఆరు వేల దాకా అణ్వాయుధాలున్నాయి!!

అమెరికా-రష్యా అణుయుద్ధంతో ఆకలి విలయమే

సగం మానవాళి అంతరించే ముప్పు: రట్జర్స్‌ యూనివర్సిటీ 


న్యూయార్క్‌: అమెరికా దగ్గర ఐదు వేలకు పైగా అణ్వాయుధాలు పోగుపడి ఉన్నాయి! రష్యా దగ్గర అంతకు మించి.. అంటే ఆరు వేల దాకా అణ్వాయుధాలున్నాయి!! అలాంటి ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే? ఒకవేళ ఆ ఊహ నిజమైతే ఎంత విధ్వంసం జరుగుతుందో.. అమెరికాకు చెందిన రట్జర్స్‌ యూనివర్సిటీ అంచనా వేసింది. రష్యా-అమెరికా మధ్య పూర్తిస్థాయి అణుయుద్ధం జరిగితే సగానికి సగం మానవాళి తుడిచిపెట్టుకుపోతుందట. ప్రపంచం మొత్తాన్నీ అణుధూళి కమ్ముకోవడం వల్ల సూర్యుడి పొడ లేక పంటలు పండవు. యుద్ధం జరిగిన మూడు, నాలుగేళ్లలోనే పంట ఉత్పత్తులు 90% మేర తగ్గిపోతాయి. ప్రపంచమంతటా కరువు విలయతాండవం చేస్తుంది.


500 కోట్ల మందికి పైగా ప్రజలు ఆకలితో మలమలలాడి చచ్చిపోతారట. పంటలపైనే కాదు.. పర్యావరణంపైనా అణుయుద్ధ ప్రభావం తీవరంగా ఉంటుందని రట్జర్స్‌ వర్సిటీకి చెందిన అసిస్టెంట్‌ రిసెర్చ్‌ ప్రొఫెసర్‌ లిలి జియా తెలిపారు. ‘‘ఓజోన్‌ పొర ధ్వంసమవుతుంది. ఫలితంగా సూర్యుడి అతినీలలోహిత కిరణాలు భారీగా  భూమిని తాకుతాయి’’ అని లిలి ఆందోళన వెలిబుచ్చారు. 

Read more