Durga Pujas: బెంగళూరు విమానాశ్రయం సిబ్బంది గర్బా నృత్యం... ప్రయాణికులు కూడా...

ABN , First Publish Date - 2022-10-02T15:51:40+05:30 IST

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పూజలు

Durga Pujas: బెంగళూరు విమానాశ్రయం సిబ్బంది గర్బా నృత్యం... ప్రయాణికులు కూడా...

బెంగళూరు : శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా పూజలు, నృత్యాలతో ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. తమ సంతోషాన్ని అందరికీ పంచుతున్నారు. అదేవిధంగా బెంగళూరు విమానాశ్రయం (Kempegowda International Airport) సిబ్బంది కూడా ఎంతో ఆనందంగా గర్బా (Garba) నృత్యం చేశారు. అక్కడే ఉన్న ప్రయాణికులు కూడా వారితో కలిసి నృత్యం చేశారు. 


విమానాశ్రయం సిబ్బంది, ప్రయాణికులు కలిసి చేసిన గర్బా నృత్యం దృశ్యాలను దివ్య పుట్రేవు అనే ట్విటరాటీ ట్వీట్ చేశారు. బెంగళూరులో ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేవారిని నమ్మవలసిందేనని పేర్కొన్నారు. విమానాశ్రయం సిబ్బంది నృత్యం చేయడం చాలా బాగుందని, అంతేకాకుండా కొందరు ప్రయాణికులు కూడా వారితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం మరింత బాగుందని తెలిపారు. 


విమానాశ్రయం సిబ్బంది గర్బా వస్త్రాలను ధరించి, నృత్యం చేయడం అందరినీ ఆకర్షించింది. ప్రయాణికులంతా పెద్ద ఎత్తున వచ్చి, వారి నృత్యాన్ని తిలకించారు. 


దివ్య పుట్రేవు (Divya Putrevu) ట్వీట్‌కు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు) స్పందించింది. ప్రయాణికులకు గొప్ప అనుభూతిని ఇవ్వడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఈ కృషిని మెచ్చుకోవడం సంతోషకరమని తెలిపింది. 


దివ్య పుట్రేవు ఇచ్చిన ట్వీట్‌కు స్పందించిన యూజర్లు బెంగళూరు గొప్పతనాన్ని ప్రశంసించారు. ఇలాంటి అంతర్జాతీయ ప్రదేశాల్లో లవ్లీ పెర్ఫార్మెన్సెస్ ద్వారా సంస్కృతిని ప్రదర్శించడం కన్నా గొప్ప విషయం మరొకటి ఉండదని తెలిపారు. 






Updated Date - 2022-10-02T15:51:40+05:30 IST