SSLC: మార్చి 31 నుంచి ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలు

ABN , First Publish Date - 2022-12-06T11:35:49+05:30 IST

ఎస్‌ఎస్ఎల్‌సీ(SSLC) పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2023 మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కర్ణాటక

SSLC: మార్చి 31 నుంచి ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షలు

బెంగళూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎస్ఎల్‌సీ(SSLC) పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. 2023 మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కర్ణాటక స్కూల్‌ ఎగ్జామినేషన్‌ అసెస్‏మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌ నళిని అతుల్‌(Nalini Atul) సోమవారం షెడ్యూల్‌ను విడుదల చే శారు. మార్చి 31న ఫస్ట్‌లాంగ్వేజ్‌ కన్నడ, తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, ఉర్దూ, ఇంగ్లీష్‌, సంస్కృతం, ఏప్రిల్‌ 4న మ్యాథమేటిక్స్‌, సోషియాలజీ, 6న ఇంగ్లీష్‌, కన్నడ, 8న ఎకనామిక్స్‌తోపాటు కోర్‌ సబ్జెక్ట్‌, 10న సైన్స్‌తోపాటు అనుబంధమైన పొలిటికల్‌ సైన్స్‌, హిందూస్తానీ మ్యూజిక్‌, కర్ణాటక మ్యూజిక్‌, 13న థర్డ్‌ లాంగ్వేజ్‌ పరీక్షలతోపాటు హెల్త్‌కేర్‌, బ్యూటీ అండ్‌ వెల్‌నెస్‌, ఆటోమొబైల్‌, రిటైల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, 15న సోషియల్‌ సైన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 దాకా పరీక్షలు నిర్వహిస్తారు. ఇటీవలే పీయూ ద్వితీయ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు కాగా తాజాగా 2022-23 విద్యాసంవత్సరానికిగాను ఎస్‌ఎల్‌ఎల్‌సీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి.

Updated Date - 2022-12-06T11:35:51+05:30 IST