SpiceJet‌కు డబుల్ ట్రబుల్.. కరాచీలో ఒకటి అత్యవసర ల్యాండింగ్.. ముంబై విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు

ABN , First Publish Date - 2022-07-06T00:51:33+05:30 IST

చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌(SpiceJet) గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ సంస్థకు

SpiceJet‌కు డబుల్ ట్రబుల్.. కరాచీలో ఒకటి అత్యవసర ల్యాండింగ్.. ముంబై విమానం విండ్‌షీల్డ్‌లో పగుళ్లు

ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌(SpiceJet) గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ సంస్థకు చెందిన రెండు విమానాలు ఒకే రోజు రెండు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డాయి. గుజరాత్‌లోని కాండ్లా(Kandla) నుంచి ముంబై బయలుదేరిన విమానం బయటివైపు విండ్‌షీల్డ్‌(windshield )లో పగుళ్లు రావడంతో అత్యవసరంగా ముంబై (Mumbai)లో ప్రియారిటీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, స్పైస్‌జెట్ ఇలా అత్యవసరంగా ల్యాండ్ కావడంతో మూడు వారాల్లో ఇది ఏడో ఘటన కావడం గమనార్హం. దీంతో డీజీసీఏ (DGCA) దృష్టి సారించింది. స్పైస్‌జెట్ ప్రమాదాల్లో రెండుసార్లు డోర్ వార్నింగ్స్, ఒకసారి పక్షి ఢీకొనడం, ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్ కారడం, ఒత్తిడి సమస్య వంటివి ఉన్నాయి. 


మరోవైపు, ఈ ఉదయం ఢిల్లీ నుంచి దుబాయ్ బయల్దేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడడంతో పాకిస్థాన్‌ (Pakistan)లోని కరాచీ (Karachi)లో అత్యవసరంగా దిగింది. ఈ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా బయటపడ్డారు. స్పైస్‌జెట్ బీ737 ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఎస్‌జీ-11 (ఢిల్లీ-దుబాయ్- Delhi-Dubai)ను ఇండికేటర్ లైట్ సక్రమంగా పని చేయకపోవడంతో కరాచీకి దారి మళ్లించినట్లు తెలుస్తోంది.  

Updated Date - 2022-07-06T00:51:33+05:30 IST