ముంబైలోనే ఉండండి

ABN , First Publish Date - 2022-08-21T06:35:30+05:30 IST

ఎల్గార్‌పరిషత్‌- భీమా కోరేగాం- మావోయిస్టులతో సంబంధాలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు ముంబైను విడిచి

ముంబైలోనే ఉండండి

 వరవరరావుపై  ప్రత్యేక కోర్టు ఆంక్షలు


ముంబయి, ఆగస్టు 20: ఎల్గార్‌పరిషత్‌- భీమా కోరేగాం- మావోయిస్టులతో సంబంధాలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు ముంబైను విడిచి వెళ్లకూడదంటూ ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం ఆదేశాలు ఇచ్చింది. అనారోగ్య కారణాల దృష్ట్యా వరవరరావుకు బెయిల్‌ మంజూరైనప్పటికీ.. ప్రత్యేక కోర్టు పలు ఆంక్షలను విధించింది. శ వారం వెలువడిన ఆ ఉత్తర్వుల ప్రకారం...వరవరరావు గ్రేటర్‌ ముంబై పరిధిలోనే నివసించాలి. ముందస్తు అనుమతి తీసుకోకుం డా నగరాన్ని దాటి వెళ్లకూడదు. సహ నిందితులతోగానీ, ఇలాంటి కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవారితోగానీ సంప్రదింపులు జరపకూడదు. రూ.50వేలకు పూచీకత్తు సమర్పించాలి అని కోర్టు స్పష్టం చేసింది.

Read more