ఈడీ విచారణకు Sonia Gandhi డుమ్మా.. అనారోగ్యమే కారణమా?

ABN , First Publish Date - 2022-06-08T00:11:45+05:30 IST

మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) రేపు (బుధవారం)

ఈడీ విచారణకు Sonia Gandhi డుమ్మా.. అనారోగ్యమే కారణమా?

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు అందుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi) రేపు (బుధవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కావడం అనుమానంగానే ఉంది. ఈ నెల 2న ఆమె కరోనా బారనపడడంతో మినహాయింపు కోరనున్నట్టు తెలుస్తోంది. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్-ఏజేఎల్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ నెల 8న  తమ ఎదుట హాజరు కావాలంటూ సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది.


ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరయ్యే విషయంలో మంగళవారం మధ్యాహ్నం వరకు ఈడీకి ఎలాంటి సమాచారం పంపకపోవడంతో ఆమె హాజరుకావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అనారోగ్య కారణాల వల్ల విచారణ నుంచి మినహాయింపు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గత వారం మాట్లాడుతూ.. సోనియా త్వరలోనే కోలుకుంటారని, 8వ తేదీన విచారణకు హాజరవుతారని భావిస్తున్నట్టు చెప్పారు.

Read more