Sonia Gandhi ED case: 6 గంటల సేపు విచారణ, మూడో విడత 27న

ABN , First Publish Date - 2022-07-27T01:41:41+05:30 IST

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారంనాడు..

Sonia Gandhi ED case: 6 గంటల సేపు విచారణ, మూడో విడత 27న

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని (Sonia Gandhi) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement directorate) మంగళవారంనాడు సుమారు 6 గంటల సేపు ప్రశ్నించింది. దీంతో రెండో విడత విచారణ పూర్తయింది. బుధవారం మూడో విడత విచారణ జరగనుంది.


సోనియాగాంధీ జడ్ కేటగిరి భద్రత మధ్య ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్ర ఆమె వెంట ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సుమారు 2.5 గంటల సేపు సోనియాగాంధీని ప్రశ్నించిన ఈడీ అధికారులు ఆ తర్వాత కొద్దిపాటి విరామం ఇచ్చారు. తిరిగి 3.30 గంటల నుంచి విచారణ కొనసాగింది. బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని సోనియాగాంధీని ఈడీ అధికారులు కోరారు. కాగా, ఈ నెల 21వ తేదీన మొదటిసారి ఈడీ ముందు సోనియాగాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా డజను పైగా ప్రశ్నలు వేసి సమాధానం రికార్డు చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-07-27T01:41:41+05:30 IST