SpiceJet flight: విమానంలో ధూమపానం...టిక్ టాక్ స్టార్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-30T18:05:15+05:30 IST

స్పైస్ జెట్ విమానంలో(SpiceJet flight) టిక్ టాక్ స్టార్ బాబీ కటారియా(Bobby Kataria) ధూమపానం చేసిన(smoking inside an aircraft) ఘటన...

SpiceJet flight: విమానంలో ధూమపానం...టిక్ టాక్ స్టార్ అరెస్ట్

న్యూఢిల్లీ: స్పైస్ జెట్ విమానంలో(SpiceJet flight) టిక్ టాక్ స్టార్ బాబీ కటారియా(Bobby Kataria) ధూమపానం చేసిన(smoking inside an aircraft) ఘటన ఢిల్లీలో తాజాగా జరిగింది. స్పైస్ జెట్ విమానం ఎక్కిన బాబీ కటారియా సీటులో కూర్చొని సిగరెట్ తాగాడు. ఆగస్టు 13వతేదీన జరిగిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Civil Aviation Minister Jyotiraditya Scindia) దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన న్యూఢిల్లీ పోలీసులు బాబీకటారియాను అరెస్టు(arrested) చేశారు. బాబీకటారియాను కోర్టులో ప్రవేశపెట్టగా అతన్ని కోర్టు జుడిషీయల్ కస్టడీకి పంపించింది. బాబీ కటారియా బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు అతన్ని బెయిలుపై విడుదల చేసింది.(released on bail) 

Updated Date - 2022-09-30T18:05:15+05:30 IST