CM Deplaned: సీఎం ఫుల్లుగా తాగి విమానం ఎక్కితే దింపేశారా.. వైరల్ అవుతున్న వార్త..!

ABN , First Publish Date - 2022-09-19T23:29:02+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి (punjab cm) భగవంత్ మాన్‌కు (punjab cm bhagwant mann) సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. జర్మనీ పర్యటనలో..

CM Deplaned: సీఎం ఫుల్లుగా తాగి విమానం ఎక్కితే దింపేశారా.. వైరల్ అవుతున్న వార్త..!

ఛండీగర్: పంజాబ్ ముఖ్యమంత్రి (punjab cm) భగవంత్ మాన్‌కు (punjab cm bhagwant mann) సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన (punjab cm deplaned) ఫ్రాంక్‌ఫర్ట్ నగరం నుంచి ఢిల్లీకి వచ్చేందుకు లుఫ్తాన్సా విమానయాన సంస్థకు (punjab cm frankfurt) చెందిన విమానం ఎక్కారని, అయితే.. ఆయన పీకల దాకా మద్యం సేవించడంతో విమానం నుంచి ఆయనను దించేశారని విపక్షాలు విమర్శలకు దిగాయి. అయితే.. ముఖ్యమంత్రి కార్యాలయం ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆయన ఆరోగ్యంగా లేకపోవడం వల్లే ఆలస్యంగా ఢిల్లీకి తిరిగి వచ్చారని తెలిపింది. పంజాబ్ సీఎం (punjab cm news) పూటుగా తాగడంతో విమానంలో ప్రయాణించేందుకు నిరాకరించారనే ప్రచారంపై ఆమ్ ఆద్మీ పార్టీ విపక్షాలకు కౌంటర్ ఇచ్చింది. ఇదంతా కేవలం దుష్ప్రచారమేనని కొట్టిపారేసింది. అనుకున్న సమయం ప్రకారం విమానం బయల్దేరలేదని, ఆలస్యం అయిన మాట వాస్తవమేనని.. ఆలస్యానికి కారణం ఈ విమానానికి అనుబంధం ఉన్న మరో విమానం ఆలస్యంగా రావడమేనని లుఫ్తాన్సా వివరణ ఇచ్చినట్టుగా ఆప్ చెప్పుకొచ్చింది. విమానం ఆలస్యం అవడంపై సదరు విమానయాన సంస్థ లుఫ్తాన్సా (punjab cm lufthansa) ఇచ్చిన వివరణను ఆప్ షేర్ చేసింది. అయితే.. ఇదే ఎయిర్‌లైన్స్ వివరణలో మరో అంశాన్ని కూడా స్పష్టం చేసింది.



ప్రయాణికుల డేటాకు భద్రత కల్పించే దృష్ట్యా ఏ ఒక్క ప్రయాణికుడికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్నీ వెల్లడించలేమని తెలిపింది. ఈ వివరణ కూడా ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. అయితే.. విపక్షాలు మాత్రం భగవంత్ మాన్ (bhagwant mann lufthansa) ఫుల్లుగా తాగి చేసిన రచ్చ వల్లే నాలుగు గంటలు ఆలస్యమైందని ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారం అటు పంజాబ్‌తో పాటు ఇటు ఢిల్లీలో కూడా రాజకీయంగా పెను దుమారం రేపింది. అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్విట్టర్‌లో మాన్‌పై విమర్శలు చేశారు. లుఫ్తాన్సా విమానం నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను (bhagwant mann frankfurt) దింపేశారని.. ఆయన ఫుల్లుగా తాగొచ్చి నడవడానికి కూడా ఇబ్బందిపడ్డారని.. ఈ పరిణామం విమానం నాలుగు గంటలు ఆలస్యం కావడానికి కారణమైందని అదే విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు చెప్పినట్టుగా అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ట్వీట్ చేశారు.



ఆప్ జాతీయ సదస్సుకు కూడా భగవంత్ మాన్ (bhagwant mann germany) ఎగ్గొట్టిన పరిస్థితి ఉందని.. పంజాబ్ సీఎంకు సంబంధించి బయటికొచ్చిన ఈ వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలు సిగ్గుతో తలదించుకునేలా చేశాయని, మాన్ పంజాబీల పరువు తీశారని ట్వీట్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విమర్శించారు. ఢిల్లీ కాంగ్రెస్ కూడా పంజాబ్ ముఖ్యమంత్రి ఫూటుగా మద్యం సేవించి విమానం ఎక్కడంతో దింపేశారని, సిగ్గుపడాల్సిన పరిణామమని ట్వీట్ చేసింది. ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కంగ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 19న షెడ్యూల్ ప్రకారమే ముఖ్యమంత్రి తిరిగి వచ్చారని.. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ వదంతులేనని చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సెప్టెంబర్ 11 నుంచి 18 వరకూ పెట్టుబడులను ఆకర్షించే దృష్ట్యా జర్మనీలో ఉన్నారు.

Updated Date - 2022-09-19T23:29:02+05:30 IST