తన సర్పమే.. తన మృత్యువు!

ABN , First Publish Date - 2022-01-23T07:42:45+05:30 IST

పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? ఏదో ఒకరోజు తన యజమానినే ముద్దాడుతుంది. అమెరికాలో ఇదే జరిగిం ది. మేరీల్యాండ్‌ చార్లెస్‌ కౌంటీలో నివసించే ఓ 49 ఏళ్ల వ్యక్తి ఏకంగా 125 పాముల్ని పెంచుకుంటున్నాడు....

తన సర్పమే.. తన మృత్యువు!

మేరీల్యాండ్‌, జనవరి 22: పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుంది? ఏదో ఒకరోజు తన యజమానినే ముద్దాడుతుంది. అమెరికాలో ఇదే జరిగిం ది. మేరీల్యాండ్‌ చార్లెస్‌ కౌంటీలో నివసించే ఓ 49 ఏళ్ల వ్యక్తి ఏకంగా 125 పాముల్ని పెంచుకుంటున్నాడు. వాటిలో 14 అడుగుల పొడవుతో ఒళ్లు జలదరించే బర్మిస్‌ కొండచిలువతో పాటు బ్లాక్‌ మాంబా, కింగ్‌ కోబ్రా లాంటి అత్యంత విషపూరితమైన పాములు కూడా ఉన్నాయి. ఇటీవల అతడు బయట కనిపించకపోవడంతో పొరిగింటి వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా.. అతడి మృతదేహం పడి ఉంది. ఆ దేహం చుట్టూ పాములు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. దీంతో వాటి కాటుకే అతడు బలైపోయాడని తేల్చిన పోలీసులు.. జంతు సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు 125 పాముల్ని పట్టుకున్నారు

Read more