భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు

ABN , First Publish Date - 2022-05-03T16:06:27+05:30 IST

దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2568 పాజిటివ్ కేసులు, 20 మరణాలు నమోదు అయ్యాయి.

భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో కొత్తగా 2568 పాజిటివ్ కేసులు, 20 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 19,137 యక్టివ్ కేసులు ఉన్నాయి.  దేశంలో యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,84,913 కేసులు నమోదు అవగా... 5,23,889 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా  కరోన రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2911 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887గా ఉంది. 

Read more