మాది సంకుచిత బుద్ధి కాదు, Droupadi Murmu కే మద్దతు: Uddhav Thackeray

ABN , First Publish Date - 2022-07-13T01:22:25+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని శివసేన..

మాది సంకుచిత బుద్ధి కాదు, Droupadi Murmu కే మద్దతు: Uddhav Thackeray

ముంబై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ (NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని శివసేన (Shiv sena) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray) ప్రకటించారు. దీంతో శివసేన పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వనుందనే సస్పెన్స్‌కు తెరపడింది. మంగళవారం సాయంత్రం మీడియాతో ఉద్ధవ్ మాట్లాడుతూ, ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలనే తమ నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పారు. శివసేన ఎంపీల సమావేశంలో ఏ ఒక్కరూ మద్దతు విషయంలో పట్టుబట్టలేదని చెప్పారు.


''తొలిసారి ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిందని మా పార్టీకి చెందిన కొందరు గిరిజన నేతలు నాతో చెప్పారు. నిజానికి ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆమెకు నేను మద్దతు ఇచ్చి ఉండాల్సింది కాదు. కానీ, మాది సంకుచిత బుద్ధి కాదు'' అని ఉద్ధవ్ అన్నారు.

Read more