Dahi Handi video : వయసు ఓ సంఖ్య మాత్రమే : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

ABN , First Publish Date - 2022-08-21T20:18:37+05:30 IST

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే సంబరాల ఆనందం

Dahi Handi video : వయసు ఓ సంఖ్య మాత్రమే : శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది

ముంబై : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే సంబరాల ఆనందం కొనసాగుతోంది. ఈ సంతోషకర సమయంలో ఓ వీడియో క్లిప్‌ను శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chatuvedi) ట్వీట్ చేశారు. వయసు అనేది ఓ సంఖ్య మాత్రమేనని మోటివేషనల్ స్పీకర్ కత్రినా మేయర్ (Katrina Mayer) చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఓ వృద్ధ మహిళ మానవ పిరమిడ్‌ను ఎక్కి, తాడుకు వేలాడుతున్న ఉట్టిని కొట్టి, విజయవంతంగా క్రిందకు దిగిన సన్నివేశం ఈ వీడియోలో కనిపించింది. 


మహారాష్ట్రలో ఎటువంటి ఆంక్షలు లేకుండా దహీ హండీ (ఉట్టి కొట్టే సంబరాలు) ఈ సంవత్సరం పునఃప్రారంభమయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి వల్ల రెండేళ్ళపాటు ఆంక్షలు అమలయ్యాయి. శివసేనలో చీలిక రావడంతో ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు పోటాపోటీగా దహీ హండీ సంబరాలను నిర్వహించాయి. ఉట్టి కొట్టిన దృశ్యాలతో కూడిన వీడియోలను ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఓ వీడియోను పోస్ట్ చేశారు. 


మోటివేషనల్ స్పీకర్ కత్రినా మేయర్ చెప్పిన మాటలను ప్రియాంక గుర్తు చేశారు. ‘‘వయసుకు విలువ లేదని తెలుసుకునేంత పెద్దవారం అయ్యే వరకు మనం లెక్కపెట్టుకునే సంఖ్య మాత్రమే వయసు’’ అని కత్రినా మేయర్ అన్నారని, ఆ విషయాన్ని ఈ వీడియో రుజువు చేస్తోందని పేర్కొన్నారు. ఉట్టి కొట్టే సంబరం నిజంగా అందరినీ కలుపుకునిపోయే పండుగ అని తెలిపారు. 




Updated Date - 2022-08-21T20:18:37+05:30 IST

Read more