శివసేనకు కౌంటర్‌: 3 పేజీల లేఖ విడుదల చేసిన ఏక్‌నాథ్ షిండే

ABN , First Publish Date - 2022-06-23T23:16:21+05:30 IST

మహారాష్ట్ర(Maharashtra)లో వేడి మీదున్న రాజకీయ(Political) డ్రామాకు రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మరింత ఆజ్యం పోశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారంటూ గురువారం 3 పేజీల లేఖ (3 pages letter) విడుదల చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మీడియాతో సమావేశమై అధికారిక నివాసాన్ని వదిలేస్తున్నట్లు ప్రకటించిన..

శివసేనకు కౌంటర్‌: 3 పేజీల లేఖ విడుదల చేసిన ఏక్‌నాథ్ షిండే

ముంబై: మహారాష్ట్ర(Maharashtra)లో వేడి మీదున్న రాజకీయ(Political) డ్రామాకు రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) మరింత ఆజ్యం పోశారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారంటూ గురువారం 3 పేజీల లేఖ (3 pages letter) విడుదల చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మీడియాతో సమావేశమై అధికారిక నివాసాన్ని వదిలేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజు షిండే తన మద్దతుదారులతో కూడిన ఫొటోను, లేఖను విడుదల చేయడం గమనార్హం. కాగా, ఈ లేఖలో సీఎం ఉద్ధవ్ ఎవరికీ అందుబాటులో ఉండడం లేదని, అయితే తమ తిరుగుబాటుతో సీఎం ఇంటి తలుపులు ఇప్పుడు తెరుచుకున్నాయని రాసుకొచ్చారు. షిండే విడుదల చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. కాగా, దీనికి ముందు అస్సాంలోని గువహాటిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే క్యాంపు నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి శివసేన గూటికి వచ్చారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెబల్ క్యాంపు మాత్రం తమ పట్టువీడడం లేదు. కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు నుంచి బయటకు వచ్చి బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని డిమాండ్ చేస్తోంది.

Read more