ప్రధాని మోదీకి షేక్ హసీనా ధన్యవాదాలు

ABN , First Publish Date - 2022-03-09T17:18:31+05:30 IST

భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బుధవారం ధన్యవాదాలు తెలిపారు....

ప్రధాని మోదీకి షేక్ హసీనా ధన్యవాదాలు

ఉక్రెయిన్ నుంచి బంగ్లాదేశీయులను తరలించినందుకు...

న్యూఢిల్లీ : భారతప్రధానమంత్రి నరేంద్రమోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బుధవారం ధన్యవాదాలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి తమ దేశ ప్రజలను సురక్షితంగా తరలించినందుకు బంగ్లాదేశ్ ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కృతజ్ఞతలు తెలిపినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత భారత్ ఆపరేషన్ గంగా పథకం కింద ఉక్రెయిన్ దేశంలోని సుమీ నుంచి పోల్టావాకు పౌరులను తరలించారు.కైవ్, చెర్నిహివ్, సుమీ, ఖార్కివ్, మారియుపోల్ నగరాల్లో కాల్పుల విరమణ అమలుతో అక్కడ ఉన్న విదేశీయులను సురక్షితంగా తరలించారు. సుమీ నుంచి 12 బస్సుల్లో భారతీయ కాన్వాయ్ తో భారతీయులను ఖాళీ చేయించారు.


భారత కాన్వాయ్ కు భారత రాయబార కార్యాలయం అధికారులు, రెడ్ క్రాస్ అధికారులు తోడుగా ఉన్నారు.ఉక్రెయిన్ నుంచి 9మంది బంగ్లాదేశీయులను కూడా భారత్ తరలించింది. నేపాల్, ట్యునీషియా దేశాల విద్యార్థులను కూడా భారత్ తీసుకువచ్చింది. తాను కంట్రోల్ రూమ్‌తో తనిఖీ చేయగా 694 మంది భారతీయ విద్యార్థులు సుమీలో చిక్కుకుపోయారని గుర్తించి బుధవారం వాళ్లను పోల్తావాకి బస్సుల్లో తీసుకువచ్చానని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు.


Read more