ఈడీతో సమాచారం పంచుకోండి

ABN , First Publish Date - 2022-11-25T04:02:51+05:30 IST

మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎల్‌ఎంఏ) పరిధిలోకి వచ్చే నేరాల సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)తో

ఈడీతో సమాచారం పంచుకోండి

ఆర్మీ సహా 15 విభాగాలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ, నవంబరు 24: మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎల్‌ఎంఏ) పరిధిలోకి వచ్చే నేరాల సమాచారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)తో పంచుకోవాలని మిలిటరీ ఇంటెలిజెన్స్‌, విదేశీ వ్యవహారాల శాఖ, నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌తో సహా 15 విభాగాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తు ఈడీ పరిధిలోకి వస్తే సమాచారం పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఎన్‌ఐఏ, రాష్ట్ర పోలీసు విభాగాలు, సిట్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ విభాగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2022-11-25T04:02:53+05:30 IST