China Army Angry On Jinping?: జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడకపోవటాన్ని చైనా ఆర్మీ అవమానంగా భావించిందా?

ABN , First Publish Date - 2022-09-25T23:51:38+05:30 IST

బీజింగ్: ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో వారం క్రితం జరిగిన షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశాల్లో ప్రధానమంత్రి

China Army Angry On Jinping?: జిన్‌పింగ్‌తో మోదీ మాట్లాడకపోవటాన్ని చైనా ఆర్మీ అవమానంగా భావించిందా?

మోదీ పట్టించుకోకపోవడాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ జీర్ణించుకోలేకపోయిందా? 


బీజింగ్: ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో వారం క్రితం జరిగిన షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping)తో మాట్లాడకపోవడాన్ని చైనా ఆర్మీ అవమానంగా భావించిందా? జిన్‌పింగ్‌తో మోదీ కనీసం కరచాలనం కూడా చేయకుండా పట్టించుకోకుండా ఉండటాన్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ జీర్ణించుకోలేకపోయిందా? అందుకే  షాంఘై సహకార సంఘం సమావేశాలు ముగించుకుని బీజింగ్ రాగానే జిన్‌పింగ్‌‌ను హౌస్‌ అరెస్ట్ చేశారా? జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు అందుకే జరిగిందా?  చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (People’s Liberation Army) పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి జిన్‌పింగ్‌ను అందుకే తొలగించారా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్ లి కియోమింగ్‌ (General Li Qiaoming)ను చైనా అధ్యక్షుడిగా అందుకే ప్రకటించారా? 


తిరుగుబాటు, హౌస్ అరెస్ట్, పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి జిన్‌పింగ్‌ను తొలగించడం వంటి పుకార్లు నెట్టింట షికారు చేస్తున్న తరుణంలో అసలు జిన్‌పింగ్‌పై చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ‌కి కోపం ఎందుకు వచ్చింది? సోషల్ మీడియా(social media) లో జిన్‌పింగ్‌ పోస్టులు అకస్మాత్తుగా ఎందుకు వైరల్ అవుతున్నాయి. వీటన్నింటికీ షాంఘై సహకార సంఘం సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మోదీ లెక్కచేయకపోవడమే కారణామా? 


చైనా ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మారింది. అనేక అంశాలపై అమెరికా, యూరప్ దేశాలను ధిక్కరించగలుగుతోంది. ఆర్ధిక రంగంలోనూ, ఆర్మీ విషయంలోనూ చైనా దూకుడుగా ఉంది. ప్రపంచం సంగతి పక్కనపెడితే ఆసియాలో చైనాయే పెద్దన్న. ఎవ్వరూ కదనలేనిది. అయితే పెద్దన్న అయిన తమను భారత ప్రధాని మోదీ పట్టించుకోకపోవడం, లెక్కచేయకపోవడం చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ‌కి కోపం తెప్పించి ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 


జిన్‌పింగ్‌ మోదీ మధ్య గట్టి స్నేహ సంబంధాలున్నాయి. మోదీ గుజరాత్ ప్రధానిగా ఉన్నప్పటి నుంచే జిన్‌పింగ్‌తో సత్సంబంధాలు కొనసాగించారు. ఈ తరుణంలో ఇద్దరు నాయకులు కనీసం 18 సార్లు సమావేశమయ్యారు. మోదీ వ్యక్తిత్వ ప్రభావం వల్ల జిన్‌పింగ్ భారత్ విషయంలో దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారా? గల్వాన్ ఘటన తర్వాత మోదీ చైనా యాప్‌లను నిషేధించడంతో పాటు వ్యాపార సంబంధాలను దాదాపు తెంచుకున్నా చైనా సంయమనం పాటించింది. గల్వాన్ ఘటన నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకే జిన్‌పింగ్ కూడా శ్రద్ధ చూపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో జిన్‌పింగ్ భారత్ విషయంలో మెతకవైఖరి అవలంభిస్తున్నారని చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భావిస్తున్నట్లు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే తాజా తిరుగుబాటు, హౌస్ అరెస్ట్, పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి జిన్‌పింగ్‌ను తొలగించడం వంటి ఘటనలు జరుగుతున్నాయా ? తిరుగుబాటు, హౌస్ అరెస్ట్, పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి జిన్‌పింగ్‌ను తొలగించడం వంటి అంశాలన్నీ పుకార్లే కావొచ్చు కానీ చైనా అధికారిక మీడియా ఇప్పటివరకూ ఒక్క ఖండన కూడా చేయలేదు. వాస్తవానికి గతంలో ఎప్పుడైనా చైనాకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ విరుచుకుపడేది. దాదాపు యుద్ధం చేసినంత పనిచేసేది. ఇటీవల తైవాన్‌లో అమెరికా స్పీకర్ నాన్సీ పర్యటించినప్పుడు చైనా మీడియా దూకుడు ప్రపంచమంతా చూసింది. మరి ఇప్పుడు తిరుగుబాటు, హౌస్ అరెస్ట్, పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి జిన్‌పింగ్‌ను తొలగించడం వంటి అంశాలు పుకార్లుగా, కథనాలుగా మీడియాలో వెలువడుతున్నా గ్లోబల్‌ టైమ్స్‌ కానీ  చైనా కమ్యూనిస్ట్ పార్టీకి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కానీ ఏ ప్రకటనా విడుదల చేయలేదు. ఏ ఖండనా చేయలేదు. అందుకే ఈ కథనాలకు ప్రాధాన్యత ఏర్పడింది. 


ప్రత్యర్థులపై కక్షసాధింపే కారణమా?

ఎదురేలేదన్నట్లు చైనాను పాలిస్తున్న జిన్‌పింగ్‌ పరిస్థితి అకస్మాత్తుగా ఎందుకు తలకిందులైంది..?

జీవితకాల అధ్యక్షుడైన ఆయనకు ఉద్వాసన గతి ఎందుకొచ్చింది..? 


ఈ ప్రశ్నలకు సమాధానం కమ్యూనిస్టు పార్టీలో గిట్టనివారిపై పింగ్‌ కక్షసాధింపునకు దిగడమే కారణమని తెలుస్తోంది. అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చైనాలో ఇద్దరు మాజీ మంత్రులకు మరణశిక్ష పడింది. నలుగురు అధికారుకుల జీవిత ఖైదు విధించారు. వీరంతా పింగ్‌కు ప్రత్యర్థులని ప్రచారం ఉంది. మరణశిక్షకు గురైనవారిలో న్యాయ శాఖ మాజీ మంత్రి ఫు జెంగ్‌ హువా, వాంగ్‌లైక్‌ ఉన్నారు. వ్యాపారం, పదవులు, కేసుల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని వీరిపై అభియోగాలున్నాయి. ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ప్రచారం నిర్వహిస్తోంది. ఇదే సమయంలో జిన్‌ పింగ్‌ ప్రత్యర్థులకు ‘శిక్షలు పడడం’ చర్చనీయాంశమైంది. కాగా, మరికొద్ది వారాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ పునర్‌ వ్యవస్థీకరణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్టీలోని తన వ్యతిరేకులను అణచివేసేందుకే జిన్‌ పింగ్‌.. ఇలా చేశారని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నిటి మధ్య పింగ్‌ ఏకపక్ష ధోరణిని సహించలేక సీసీపీ ఆయనను తొలగించిందని వార్తలు వస్తున్నాయి. అయితే, జిన్‌ పింగ్‌ ఎస్సీవో సదస్సులో ఉండగా.. ఆయన వ్యతిరేకులు పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఒప్పించి పదవి నుంచి తప్పించేలా చేశారని చెబుతున్నారు. తదనంతర పరిణామాలపై ప్రచారాన్ని ఈ వర్గమే మొదలుపెట్టినట్లు భావిస్తున్నారు. పింగ్‌కు ఉద్వాసనపై పెద్దఎత్తున ఊహాగానాలు వస్తున్నా.. చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ కమ్యూనిస్టు పార్టీ స్పందించలేదు. ఏ అంతర్జాతీయ మీడియా కూడా ఈ కథనాలను ధ్రువీకరించలేదు. ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్సీవో సదస్సులో జిన్‌ పింగ్‌ ముభావంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కొవిడ్‌ జాగ్రత్తలంటూ ఇతర నాయకులతో కలిసి ఆయన భోజనం చేయలేదు.   


Read more