బిడ్డను విసిరేసి తల్లిపై లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2022-12-12T05:25:20+05:30 IST

ఆ క్యాబ్‌ డ్రైవర్‌, అందులోని ప్రయాణికులది ఎంతటి మదోన్మాదం! పదినెలల బిడ్డతో క్యాబ్‌ ఎక్కిన మహిళ మీద కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశారు.

బిడ్డను విసిరేసి తల్లిపై లైంగిక వేధింపులు

శిశువు మృతి.. ప్రాణాపాయస్థితిలో తల్లి..

మహారాష్ట్రలో దుండగుల దారుణం

పాల్‌ఘర్‌, డిసెంబరు 11: ఆ క్యాబ్‌ డ్రైవర్‌, అందులోని ప్రయాణికులది ఎంతటి మదోన్మాదం! పదినెలల బిడ్డతో క్యాబ్‌ ఎక్కిన మహిళ మీద కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశారు. మహిళ ప్రతిఘటించడంతో ఆమె చేతిలోంచి బిడ్డను లాక్కుని.. కదులుతున్న కారులోంచి బయటకు విసిరివేశారు! బిడ్డ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి ఆమెనూ కారులోంచి తోసేశారు. తీవ్ర గాయాలతో ఆమె చావుబతుకులో కొట్టుమిట్టాడుతోంది మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌ జిల్లాలో ముంబై-అహ్మదాబాద్‌ హైవే మీద శనివారం ఉదయం ఈ దారుణ ఘటన జరిగింది.

Updated Date - 2022-12-12T05:25:20+05:30 IST

Read more