ముఖేష్‌ అంబానీకి భద్రత పెంపు !

ABN , First Publish Date - 2022-09-30T06:45:22+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఎండీ ముఖేష్‌ అంబానీ భద్రతను కేంద్ర హోం శాఖ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కల్పిస్తున్న జడ్‌ కేటగిరీ భద్రతను జడ్‌ ప్లస్‌కు పెంచారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద పేలుడు

ముఖేష్‌ అంబానీకి భద్రత పెంపు !

జడ్‌ ప్లస్‌ కేటగిరీకి పెంచిన హోం శాఖ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఎండీ ముఖేష్‌ అంబానీ భద్రతను కేంద్ర హోం శాఖ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కల్పిస్తున్న జడ్‌ కేటగిరీ భద్రతను జడ్‌ ప్లస్‌కు పెంచారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద పేలుడు పదార్ధాలతో ఉన్న వాహనం గతేడాది దొరికినప్పటి నుంచి  భద్రత పెంపుపై కేంద్రం చర్చిస్తోంది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ కింద  55 మంది సిబ్బంది అంబానీకి రక్షణగా ఉంటారు.

Read more