Jammu and Kashmir: జమ్మూకశ్మీరులో బైపాస్ రోడ్డుపై పేలుడు పదార్థాలు

ABN , First Publish Date - 2022-12-13T10:05:04+05:30 IST

జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్‌లో కేంద్ర భద్రతా బలగాలు మంగళవారం ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని....

Jammu and Kashmir: జమ్మూకశ్మీరులో బైపాస్ రోడ్డుపై పేలుడు పదార్థాలు
Security Forces Detect IED

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని సోపోర్‌లో కేంద్ర భద్రతా బలగాలు మంగళవారం ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (ఐఇడి) గుర్తించాయి.(Security Forces)పేలుడు పదార్థాలు గుర్తించిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేయడానికి యాంటీ బాంబ్ స్క్వాడ్‌ని(Bomb Disposal Squad) పిలిచారు. లా కాలేజీ సమీపంలోని సోపోర్ పట్టణ బైపాస్ రోడ్డుపై పేలుడు పదార్థాలు లభించడంతో ఆ రహదారిని మూసివేశారు. దక్షిణ కశ్మీరులోని షోపియాన్‌లోని షిర్మల్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం పేలుడు పదార్థాలను(Detect IED) స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. గత నెలలో ఉత్తర కాశ్మీర్‌లోని బందిపూర్ జిల్లాలో పేలుడు పదార్థాలను కనుగొన్నారు. పేలుడు పదార్థాలను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. రోడ్డుపై పేలుడు పదార్థాలు ఉంచడం ఉగ్రదాడిలో భాగమేనని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-12-13T10:05:05+05:30 IST