Secundrabad-Rameshwaram మధ్య ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2022-07-15T13:51:04+05:30 IST

సికింద్రాబాద్‌ - రామేశ్వరం మధ్య వీక్లీ స్పెషల్‌ రైలును కొనసాగించనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ మేరకు 07685 నెంబరు రైలు ఆగస్టు 2, 9,

Secundrabad-Rameshwaram మధ్య ప్రత్యేక రైలు

చెన్నై, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ - రామేశ్వరం మధ్య వీక్లీ స్పెషల్‌ రైలును కొనసాగించనున్నట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ మేరకు 07685 నెంబరు రైలు ఆగస్టు 2, 9, 16 తేదీల్లో రాత్రి 9.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మూడో రోజు ఉదయం 3.10 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (నంబరు:07686) ఆగస్టు 4, 11, 18 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు రామేశ్వరంలో బయలుదేరి మూడవ రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్‌ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచే చేసుకోవచ్చని దక్షిణరైల్వే ప్రకటించింది.

Updated Date - 2022-07-15T13:51:04+05:30 IST