సిద్ధమవుతున్న పాఠశాలలు

ABN , First Publish Date - 2022-06-12T13:50:30+05:30 IST

వచ్చే విద్యా సంవత్సరం (2022 -23)కు ఈ నెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో పాఠశాల గదులు, ప్రాంగణాలను

సిద్ధమవుతున్న పాఠశాలలు

వేలూరు(చెన్నై), జూన్‌ 11: వచ్చే విద్యా సంవత్సరం (2022 -23)కు ఈ నెల 13వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో పాఠశాల గదులు, ప్రాంగణాలను శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి. స్థానిక కార్పొరేషన్‌ మొదటి మండల అధ్యక్షుడు పుష్పలత వన్నియరాజ నేతృత్వంలో శనివారం కాట్పాడిలో ఉన్న ప్రభుత్వ  మహిళా ఉన్నత పాఠశాలలో శుభ్రతా పనులు చేపట్టారు. ఆరోగ్యశాఖ అధికారి శివకుమార్‌, మదిఅయగన్‌, రమేష్‌ పర్యవేక్షణలో పారిశుధ్య కార్మికులు పాఠశాల ప్రాంగణాలను శుభ్రం చేశారు. శుభ్రతా పనులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరళ, టెక్నికల్‌ విద్య ఉపాధ్యాయుడు జనార్ధనన్‌, కార్పొరేటర్‌ చిత్ర లోకనాధన్‌, వ్యాయామ ఉపాధ్యాయులు భువన, కౌసల్య పర్యవేక్షించారు.

Read more