Satyapradasahu: ఓటరు జాబితా సవరణలకు 17 లక్షల దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-11-30T07:28:31+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు నిర్వహించిన ఓటరు జాబితా సవరణ ప్రత్యేక శిబిరాల్లో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో పేరు నమోదుకు 7.57 లక్షల

Satyapradasahu: ఓటరు జాబితా సవరణలకు 17 లక్షల దరఖాస్తులు

- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 29: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు నిర్వహించిన ఓటరు జాబితా సవరణ ప్రత్యేక శిబిరాల్లో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో పేరు నమోదుకు 7.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 9వ తేదీ విడుదల చేశారు. ఆ రోజు నుంచే ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు, కొత్తగా చేర్పులు, చిరునామా మార్పు తదితరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అందులో భాగంగా ఈ నెల 12,13,26,27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) మాట్లాడుతూ, నాలుగు రోజులు నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 17,02,689 దరఖాస్తులు అందాయన్నారు. ప్రవాస తమిళులకు కూడా రాష్ట్ర ఓటరు జాబితాలో పేరు నమోదుచేసుకొనే అవకాశం కల్పించగా, 9 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జాబితాలో పేరు చేర్చితే వారు ఎన్నికల సమయంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-30T07:28:32+05:30 IST