టిక్కెట్లు అమ్ముకుంటున్న ఎస్పీ: యోగి

ABN , First Publish Date - 2022-01-18T01:06:22+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ..

టిక్కెట్లు అమ్ముకుంటున్న ఎస్పీ: యోగి

ఘజియాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను సమాజ్‌వాదీ పార్టీ  బహిరంగంగా ప్రకటించ లేదని, డబ్బులు తీసుకుని టిక్కెట్లు కేటాయిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సోమవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, అలవాట్లు అంత త్వరగా మారవని, అందుకోసమే అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు ముఖం చేటేస్తున్నారని, బహిరంగంగా పేర్లు బయటపెట్టకుండా పార్టీ గుర్తును గుట్టుచప్పుడు కాకుండా కేటాయిస్తూ, అందుకోసం సొమ్ములు తీసుకుంటున్నారని అన్నారు. టిక్కెట్లను నేరస్థులకు కేటాయించడం ద్వారా తమ నిజ స్వరూపాన్ని సమాజ్‌వాదీ పార్టీ మరోసారి చాటుకుంటోందని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ నేరగాళ్లందరినీ చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. గత ఐదేళ్లుగా ఇక్కడ నేరగాళ్లు, హిస్టరీ షీటర్లు భయంతో వణుకుతున్నారని పేర్కొన్నారు.


పూర్తి మెజారిటీతో గెలుస్తాం

మార్చి 10వ తేదీన బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజానీకం ఆశీస్సులతో బీజేపీ అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగానే గూండాలు, నేరగాళ్లపై కొరడా తీస్తామని హామీ ఇచ్చారు.


Read more