రూ. 1.54 కోట్ల ‘ఆమ్నెస్టీ’ ఆస్తుల జప్తు

ABN , First Publish Date - 2022-10-08T09:09:20+05:30 IST

అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ’కి అనుబంధంగా మన దేశంలో పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (ఏఐపీఎల్‌) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం జప్తు చేసింది.

రూ. 1.54 కోట్ల ‘ఆమ్నెస్టీ’ ఆస్తుల జప్తు

సీబీఐ కేసుతో ఈడీ చర్యలు

న్యూఢిల్లీ, అక్టోబరు 7: అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ‘ఆమ్నెస్టీ’కి అనుబంధంగా మన దేశంలో పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ (ఏఐపీఎల్‌) ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం జప్తు చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) ఉల్లంఘించి నిధులు సేకరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆమ్నెస్టీకి చెందిన రూ.1.54 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. 2011-12 మధ్య విరాళాలు తీసుకోడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సంస్థ 2012-13, 2013-14, ఆర్థిక సంవత్సరాల్లో కూడా నిధులు సేకరించిందని సీబీఐ కేసు నమోదు చేసింది. దీనిపై ఈడీ కూడా సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించి మనీలాండరింగ్‌ జరిగిందని నిర్ధారించుకుని ఆస్తులను జప్తు చేసింది. 

Read more