షార్ నుంచి రాకెట్ ప్రయోగం - సిగ్నల్స్ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు

ABN , First Publish Date - 2022-08-07T16:28:38+05:30 IST

Nellore: సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) (Satish Dhawan Space Centre) నుంచి ఎస్ఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి ప్రయోగించారు. 9.18 గంటలకు ఆకాశంలోకి దూసుకెళ్లిన రాకెట్ 13.12

షార్ నుంచి రాకెట్ ప్రయోగం - సిగ్నల్స్ కోసం శాస్త్రవేత్తల ప్రయత్నాలు

Nellore: సతీష్ థావన్ స్పేస్ సెంటర్  (షార్) (Satish Dhawan Space Centre) నుంచి  ఎస్ఎస్ఎల్వీ (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) రాకెట్‌ (Rocket)ను నింగిలోకి ప్రయోగించారు. 9.18 గంటలకు ఆకాశంలోకి దూసుకెళ్లిన రాకెట్ 13.12 నిమిషాల్లో ఆజాదీ శాటిలైట్‌ను కక్ష్యలోకి  ప్రవేశపెట్టింది. అయితే శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ అందక పోవడంతో ఇస్రో శాస్త్రవేతల్లో టెన్షన్ నెలకొంది. సిగ్నల్స్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ‘‘SSLV-D1 నాలుగు దశలు దాటుకుని ముందుకెళ్లింది. అయితే టెర్మినల్‌ దశలో కొంత డేటా మిస్ అయింది. మిషన్‌ తుది ఫలితాన్ని విశ్లేషిస్తున్నాం. ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరలో సమాచారం ఇస్తామని’’ ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు.  


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చిన్నపాటి ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1)ను రూపొందించింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) నుంచి ఆదివారం నింగిలోకి  ప్రయోగించారు. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ ద్వారా  రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఏ ఉపగ్రహం అధిక రిజల్యూషన్‌తో కూడినది. ప్రయోగాత్మక ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహమైన మైక్రోశాట్‌–2ఏ భూమికి తక్కువ ఎత్తులో ఉండి భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంది. మరో చిన్న ఉపగ్రహం పేరు ఆజాదీ శాట్‌. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్‌ కౌంటర్లు, సోలార్‌ ప్యానల్‌ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లను ఇందులో అమర్చారు.

Updated Date - 2022-08-07T16:28:38+05:30 IST