నేరగాళ్ల నర్తనశాల..!

ABN , First Publish Date - 2022-01-03T07:19:20+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. ‘‘మా దగ్గర అన్ని పార్టీల్లోనూ బాహుబలులు ఉన్నారు. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా?ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. ‘‘మా దగ్గర అన్ని పార్టీల్లోనూ బాహుబలులు ఉన్నారు. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా?....

నేరగాళ్ల నర్తనశాల..!

అన్ని పార్టీల్లోనూ కళంకితులే

ప్రస్తుత యూపీ అసెంబ్లీలో అత్యధిక

నేరచరితులు బీజేపీ ఎమ్మెల్యేలే!

హేయమైన నేరాలకు పాల్పడిన

ప్రజాప్రతినిధులూ ఉన్నారు!

ఉత్తరప్రదేశ్‌లో చర్చనీయాంశంగా 

మారిన నేరచరితుల అంశం


న్యూఢిల్లీ, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నేరచరితుల అంశం చర్చనీయాంశంగా మారింది. ‘‘మా దగ్గర అన్ని పార్టీల్లోనూ బాహుబలులు ఉన్నారు. రాష్ట్రంలో నేరస్థులు రాజకీయ నాయకులయ్యారా లేక రాజకీయ నాయకులు నేరస్థులయ్యారా? అన్నది చెప్పడం కష్టం’’ అని యూపీకి చెందిన ఓ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడీ విశ్లేషణ అత్యంత ప్రాధాన్యంసంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా ప్రతి బీజేపీ నేతా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నేరస్థులను పెద్దఎత్తున అరికట్టిందని ప్రతి ఎన్నికల సభలోనూ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారంకూడా మేరఠ్‌లో ప్రధాని మా ట్లాడుతూ.. యోగి ప్రభుత్వం నేరస్థులతో జైలు ఆట ఆడుకుంటోంద ని చెప్పారు.


అయితే అసోసియేష న్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) నివేదిక ప్రకారం ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 80మంది యూపీ ఎంపీల్లో 25 మంది నేరచ రితులు కాగా వారిలో 21 మందిపై తీవ్ర నేరాలకు సంబంధించి కేసులు ఉ న్నాయి. ప్రస్తుత అసెంబ్లీలో మొ త్తం 403 మంది ఎమ్మెల్యేల్లో 143 మందికి నేర చరిత్ర ఉంది. వీరిలో అత్యధికులు బీజేపీకి చెందిన వారే. బీజేపీ నుంచి 312 మంది గత అసెంబ్లీకి ఎన్నికవగా, వారిలో 114 మంది నేరచరితులని, అందులో 83 మంది హేయమైన నేరాలకు పాల్పడ్డారని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎన్నికైన 47 మందిలో 14 మంది, బీఎస్పీ నుంచి ఎన్నికైన 19 మందిలో ఐదుగురు, కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన ఏడుగురిలో ఒక్కరు నేరచరితులు. స్వతంత్రులుగా ఎన్నికైన ముగ్గురూ తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారే!


జైల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు..

గత అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ముగ్గురు ఎమ్మెల్యే లు ముక్తార్‌ అన్సారీ, కుల్దీప్‌ సింగ్‌, బ్రజేష్‌ సింగ్‌ ప్రస్తు తం జైల్లో ఉన్నారు. వీరిలో ఇద్దరికి బీజేపీతో సంబంధాలున్నాయి. ముక్తార్‌ అన్సారీ ఐదుసార్లు బీఎస్పీ నుంచి గెలుపొందగా, ఈసారి మజ్లిస్‌ లేదా సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ ఆయనకు టికెట్‌ ఇచ్చే అవకాశాలున్నాయి. కాగా, ఉద్యోగం కోసం వచ్చిన 16 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి, ఆమె తండ్రి, బంధువులను హత్య చేసిన కేసుతో పాటు అనేక నేరాల్లో ఇరుక్కున్న కుల్దీప్‌ సింగ్‌ గత ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్నికయ్యారు.


ప్రజల్లో నిరసన రావడంతో 2019లో అతడిని పార్టీ బహిష్కరించింది. మరో నేరచరితుడైన ఎమ్మెల్యే బ్రజేశ్‌ సింగ్‌ ప్రగతిశీల మానవ సమాజ్‌ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఈయన కుటుంబానికి బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. హమీర్‌పూర్‌ నుంచి బీజేపీ తరఫున గెలిచిన అశోక్‌సింగ్‌ ఛండేల్‌కు సామూహిక హత్యా నేరం కేసులో శిక్ష పడింది. దీంతో అసెం బ్లీ సభ్యత్వం కోల్పోయి పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన భార్య బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయోధ్యలోని గోసాయి గంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇంద్రప్రతాప్‌ తివారీ నకిలీ మార్కులతో బీఎస్సీలో అడ్మిషన్‌ సంపాదించాడని తేలడంతో ఐదేళ్ల శిక్ష పడింది. అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయారు. నేర చరిత్ర వల్ల అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయిన నలుగురిలో ఇద్దరు బీజేపీకి చెందినవారే కావడం గమనార్హం. పూర్వాంచల్‌లోని గోరఖ్‌పూర్‌లో కాంగ్రెస్‌, బీజేపీ, బీఎస్పీ, ఎస్పీలకు బ్రాహ్మణ ఓటు వచ్చేందుకు కారకుడైన మరో ప్రముఖ నేరచరితుడు హరిశంకర్‌ తివారీ, అతని కుమారులు ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీ, మాజీ ఎంపీ భీష్మ శంకర్‌ తివారీ, అత ని బంధువు, మాజీ స్పీకర్‌ గణేశ్‌ శంకర్‌ పాండే ఇటీవల ఎస్పీలో చేరడంతో బీజేపీకి గట్టి దెబ్బ తగులుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఇతర నేర చరితుల జాబితాలో ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. నిషాద్‌ పార్టీకి చెంది న విజయ్‌ మిశ్రాపై 73 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఇటీవల ఈ పార్టీ, బీజేపీ కలిసి నిర్వహించిన ర్యాలీలో హోం మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు.  


కేసుల ఉపసంహరణ.. సుప్రీం అభ్యంతరం

2013లో ముజఫర్‌నగర్‌ అల్లర్లతో సంబంధం ఉన్న వారిపై యూపీ సర్కారు 77 కేసులను ఉపసంహరించుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు సంగీత్‌ సోము, సురేశ్‌ రాణా, కపిల్‌ దేవ్‌తో పాటు సాధ్వీ ప్రాచీ ఉన్నారు. ఓ విద్యార్థిని కిడ్నాప్‌, అత్యాచారం కేసులో కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందపై కేసును యూపీ సర్కారు ఉపసంహరించుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న అజయ్‌ మిశ్రా తేనీపై హత్యా నేరంతో పాటు అనేక కేసులు ఉన్నాయి. మావు-ఘాజీపూర్‌ ప్రాంతంలో అన్సారీ ముస్లిం ఓటు బ్యాంకును సంఘటితం చేస్తే, అజయ్‌ మిశ్రా తేనీ హిందూ ఓటు బ్యాంకును చేశారని.. ఇద్దరి మధ్యా సారూప్యం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ కొన్ని సందర్భాల్లో మాఫియా, నేరచరితులతో పరోక్ష సంబంధాలు పెట్టుకుందని చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో మాఫియా డాన్‌ ధనుంజయ్‌ సింగ్‌ అప్నాదళ్‌ నుంచి సీటుకు ప్రయత్నిస్తున్నారు.


ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాఫియా డాన్‌ డీపీ యాదవ్‌.. రాష్ట్రీయ పరివర్తన్‌ దళ్‌ పేరిట సొంత పార్టీని పెట్టి బీజేపీ సహకారంతో సహస్వాన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. మరో మాఫియా డాన్‌ బిల్కాపూర్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి గెలిచారు. ఇతడిని ఇటీవలే బీజేపీలో చేర్చుకోగా ఎంపీ రీటా బహుగుణ వ్యతిరేకించడంతో సభ్యత్వాన్ని రద్దు చేశారు. 


పార్టీలతో సంబంధాల్లేని 

వారినే కాల్చేశారు!

యూపీలో రాజకీయ పార్టీలతో సంబంధాలు లేని వారినే ఎన్‌కౌంటర్లలో ఎక్కువగా హతమార్చారని దైనిక్‌ భాస్కర్‌ పత్రిక తాజా సర్వేలో తేల్చింది. రూ.5 లక్షల నగదు అవార్డు ప్రకటించిన వికాస్‌ దూబేను 2020 జూలైలో, రూ.3 లక్షల రివార్డు ప్రకటించిన సూర్యాంశ్‌ దూబేను 2020 నవంబరులో, రూ.2.5 లక్షల అవార్డు ప్రకటించిన బల్‌రాజ్‌ భట్‌ను 2018 ఏప్రిల్‌లో, రూ.2 లక్షల అవార్డు ప్రకటించిన అనిల్‌ అలియాస్‌ జుథ్రాను 2020 అక్టోబరులో, రూ.1.5 లక్షల అవార్డు ప్రకటించిన చాంద్‌ మహమ్మద్‌ను 2020 జనవరిలో, లక్ష్మణ్‌ యాదవ్‌ను 2019 అక్టోబరులో హతమార్చారు. 

Updated Date - 2022-01-03T07:19:20+05:30 IST