ఓపీఎస్‌ను పునరుద్ధరించం: కేంద్రం

ABN , First Publish Date - 2022-12-13T02:52:02+05:30 IST

కేంద్ర స్థాయిలో పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్వత్‌ కారాడ్‌

ఓపీఎస్‌ను పునరుద్ధరించం: కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 12: కేంద్ర స్థాయిలో పాత పెన్షన్‌ విధానాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరించే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్వత్‌ కారాడ్‌ సోమవారం పార్లమెంటుకు తెలిపారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వానికి, పీఎ్‌ఫఆర్‌డీఏకు సమాచారం ఇచ్చాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పంజాబ్‌లో పాత పెన్షన్‌ అమలుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఇంకా సమాచారం లేదని చెప్పారు.

Updated Date - 2022-12-13T02:52:02+05:30 IST

Read more