కెనడాలో ఖలిస్థాన్‌పై రిఫరెండం

ABN , First Publish Date - 2022-09-21T07:28:48+05:30 IST

కెనడాలో సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) అనే సంస్థ ఆధ్వర్యంలో ఖలిస్థాన్‌పై రిఫరెండం నిర్వహించారు.

కెనడాలో ఖలిస్థాన్‌పై రిఫరెండం

ఓటింగ్‌లో పాల్గొన్న లక్ష మంది సిక్కులు

కెనడా, సెప్టెంబరు 20: కెనడాలో సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎ్‌ఫజే) అనే సంస్థ ఆధ్వర్యంలో ఖలిస్థాన్‌పై రిఫరెండం నిర్వహించారు. బ్రాంప్టన్‌, ఒంటారియో నగరాల్లో నిర్వహించిన రిఫరెండంలో దాదాపుగా లక్ష మంది సిక్కులు హాజరై ఓటు వేశారు. దీని వల్ల కెనడాలో భారతదేశ వ్యతిరేక శక్తులు పెరుగుతాయని కెనడా ప్రభుత్వాన్ని భారత్‌ హెచ్చరించింది. అయినా ఆ  ప్రభు త్వం లెక్కచేయలేదు. తమ దేశ చట్టాలకు లోబడి శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా అభిప్రాయాలను వ్యక్త పరిచేందుకు అనుమతి ఇచ్చినట్లు అభివర్ణించింది. భారత దేశం నుంచి పంజాబ్‌ను విడదీసి ఖలిస్థాన్‌ దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ రిఫరెండం నిర్వహించారు. 

Updated Date - 2022-09-21T07:28:48+05:30 IST