Ramdas: మేం ఒంటరే!.. ఏ కూటమిలోనూ లేం

ABN , First Publish Date - 2022-11-29T10:00:39+05:30 IST

ప్రస్తుతం తాము ఏ కూటమిలోనూ లేమని, ఒంటరిగానే వున్నామని పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(Dr. Anbumani

Ramdas: మేం ఒంటరే!.. ఏ కూటమిలోనూ లేం

- పీఎంకే నేత అన్బుమణి

చెన్నై, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం తాము ఏ కూటమిలోనూ లేమని, ఒంటరిగానే వున్నామని పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(Dr. Anbumani Ramdas) ప్రకటించారు. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి పోటీ చేసిన పీఎంకే కొన్ని సీట్లు గెలుచుకోగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. ఈ నేపథ్యంలో మైలాడుదురైలో సోమవారం ఉదయం అన్బుమణి విలేఖరులతో మాట్లాడుతూ... ప్రస్తుతం తమ పార్టీ ఏ కూటమిలోనూ లేదని, లోక్‌సభ ఎన్నికలు సమీపించినప్పుడే ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవాలా? లేక ఒంటరిగా పోటీ చేయాలా? అనే విషయంపై నిర్ణయిం తీసుకుంటామని చెప్పారు. 2026లో పీఎంకే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆ దిశగానే వ్యూహ రచన చేస్తున్నామన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో సరైన వ్యూహరచనతోనే పోటీకి దిగుతామని వివరించారు. డీఎంకే, అన్నాడీఎంకే(DMK and AIADMK) పార్టీలకు ప్రత్యామ్నాయ తృతీయ కూటమి ఏర్పాటు చేస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. ఎన్నికల సమయంలో తగు నిర్ణయం తీసుకుంటామని అన్బుమణి సమాధానమిచ్చారు.

Updated Date - 2022-11-29T10:00:41+05:30 IST