Ramdas: విద్యుత్‌ కనెక్షన్‌కు ఆధార్‌ అనుసంధానం సరికాదు...

ABN , First Publish Date - 2022-11-24T10:24:50+05:30 IST

విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయడంలో తీవ్ర గందరగోళం నెలకొందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొలగించాలని పీఎంకే

Ramdas: విద్యుత్‌ కనెక్షన్‌కు ఆధార్‌ అనుసంధానం సరికాదు...

  • పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్‌

చెన్నై, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయడంలో తీవ్ర గందరగోళం నెలకొందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తొలగించాలని పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(PMK President Dr. Anbumani Ramdas) డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో విద్యుత్‌ కనెక్షన్‌ నంబర్‌తో ఆధార్‌ నెంబర్‌ లింక్‌ చేయడంలో అనేక సమస్యలు నెలకొన్నాయి. ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేయలేకపోవడంతో ప్రజలు కరెంటు బిల్లు చెల్లించలేకపోతున్నారు. ఈ-చందాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్‌ సంస్కరణల కోసం ఆధార్‌ లింక్‌ చేయడం స్వాగతించదగ్గదే. అయితే ఏదైనా సంస్కరణ చేసే ముందు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముంది. సమయం కూడా వారికి ఇవ్వాల్సివుంది. ఆధార్‌ లింక్‌ కోసం ఆన్‌లైన్‌ లింక్‌ వారం క్రితమే ఇచ్చారు. కొద్ది రోజుల్లో లక్షలాదిమంది కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తోంది. కేవలం ఆధార్‌ అనుసంధానం ద్వారానే విద్యుత్‌ బిల్లులు చెల్లించాలనడం సరి కాదడు. ఆధార్‌ లింక్‌ కోసం కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలి. ఆలోగా విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించేందుకు విద్యుత్‌ బోర్డు ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లినప్పుడు లబ్దిదారుల ఆధార్‌ కార్డు పొంది అక్కడ వారికి నగదు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి’’ అని అన్బుమణి సూచించారు.

Updated Date - 2022-11-24T10:24:52+05:30 IST