‘రాముడి వంతెన’ రాళ్లంటూ ఆన్‌లైన్‌లో విక్రయాలు

ABN , First Publish Date - 2022-03-17T14:45:20+05:30 IST

నిషేధిత స్పటిక రాళ్లను ‘రాముడు వంతెన నిర్మాణానికి వినియోగించిన రాళ్లు’ అంటూ ఆన్‌లైన్‌లో 20 గ్రాములు రూ.5 వేలకు విక్రయిసుౖన్నట్టు తెలిసిందని, ప్రజలు

‘రాముడి వంతెన’ రాళ్లంటూ ఆన్‌లైన్‌లో విక్రయాలు

               - అప్రమత్తంగా ఉండండి: అటవీ శాఖ 


పెరంబూర్‌(చెన్సై): నిషేధిత స్పటిక రాళ్లను ‘రాముడు వంతెన నిర్మాణానికి వినియోగించిన రాళ్లు’ అంటూ ఆన్‌లైన్‌లో 20 గ్రాములు రూ.5 వేలకు విక్రయిసుౖన్నట్టు తెలిసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. రామనాధపురం జిల్లా మన్నార్‌ వలైకుడ, పాక్‌ జల సంధి ప్రాంతంలో వేలాదిగా స్పటిక రాళ్లు దర్శనమి స్తుంటాయి. ఈ  రాళ్లకుండే పాచి మధ్య సుమారు 500 రకాల సముద్రపు జీవులు నివసిస్తుంటాయి. చేపలుపట్టే సమయంలో వలలు తగిలి, కొందరు విక్రయాల కోసం తవ్వేస్తుండడంతో సముద్రపు జీవులకు ఇబ్బంది కలుగు తోంది. ఇందుకోసం ఈ రాళ్ల విక్రయాలపై నిషేధం విధించిన ప్రభుత్వాలు, వీటిని రక్షించేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాముడి వంతెన నిర్మాణం కోసం వినియోగించిన రాళ్లు అంటూ ఆన్‌లైన్‌లో స్పటికం రాళ్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ విషయమై అటవీ శాఖ జిల్లా అధికారి ఒకరు మాట్లాడుతూ, ఉన్నతరకం ఆభరణాల తయారీ, ఎక్వేరి యంలు తదితరాలకు స్పటిక రాళ్లను తవ్వేస్తున్నారని, మరోవైపు భక్తుల ఆధ్యాత్మికతను సొమ్ముచేసుకొనేలా ఈ రాళ్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని, ప్రజలు ఇలాంటి ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-03-17T14:45:20+05:30 IST