రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-05-17T14:10:56+05:30 IST

రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేసిన ప్రకటనలో,

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

- 24 నుంచి నామినేషన్ల స్వీకరణ

- జూన్‌ 10న పోలింగ్‌


చెన్నై: రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఆరు రాజ్యసభ స్థానాల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి విడుదల చేసిన ప్రకటనలో, రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ 31వ తేదీతో ముగుస్తుందన్నారు. నామినేషన్లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు (శని, ఆదివారాలు మినహా) దాఖలుచేయవచ్చని తెలిపారు. జూన్‌ 1న నామినేషన్ల పరిశీలన, 3న ఉపసంహరణ జరుగుతుందని తెలిపారు. పోలింగ్‌ 10వ తేది (ఏకగ్రీవం కాని స్థానాలకు) ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని, 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపింది. అసెంబ్లీ వ్యవహారాల కార్యదర్శి ఎన్నికల అధికారిగా, అసెంబ్లీ వ్యవహారాల సహాయ అధికారి అసిస్టెంట్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారని, సచివాలయంలోని కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని ఎన్నికల కమిషన్‌ తెలియజేసింది.

Read more