Nupur Sharmaకు మద్ధతు ఇచ్చినందుకు సహోద్యోగి తల నరికేస్తానని బెదిరింపు...నిందితుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-08T13:00:51+05:30 IST

బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసినందుకు సహోద్యోగి తలను నరికివేస్తానని...

Nupur Sharmaకు మద్ధతు ఇచ్చినందుకు సహోద్యోగి తల నరికేస్తానని బెదిరింపు...నిందితుడి అరెస్ట్

జోధ్‌పూర్(రాజస్థాన్): బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసినందుకు సహోద్యోగి తలను నరికివేస్తానని బెదిరించినందుకు జోధ్‌పూర్ పోలీసులు ఒక అడ్వకేట్ క్లర్క్‌ను అరెస్టు చేశారు.జోధ్‌పూర్ నగరానికి చెందిన మహేంద్ర సింగ్ రాజ్‌పురోహిత్‌ జూన్ 6వతేదీన నూపుర్ శర్మ చిత్రాన్ని వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసిన వెంటనే నిందితుడు సోహైల్ ఖాన్ అతన్ని బెదిరించాడని పోలీసులు తెలిపారు. వేసవి సెలవుల తర్వాత రాజస్థాన్ హైకోర్టు పునర్ ప్రారంభంతో ఖాన్ రాజ్‌పురోహిత్‌ను మళ్లీ బెదిరించాడు. దీంతో రాజ్‌పురోహిత్ ఫిర్యాదు చేయడంతో ఖాన్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఒక టీవీ చర్చ సందర్భంగా ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలను రేకెత్తించాయి.


 ఉదయపూర్‌లో టైలర్ హత్యపై వాట్సాప్ గ్రూప్‌లో అభ్యంతరకరమైన సందేశాన్ని పంపినందుకు ఒక న్యాయవాది క్లర్క్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడిని విక్రమ్‌సింగ్‌గా గుర్తించినట్లు వారు తెలిపారు.జులై 1న న్యాయవాదుల క్లర్క్‌ల వాట్సాప్ గ్రూప్‌లో సింగ్ అభ్యంతరకరమైన సందేశాన్ని పంపాడు, కాని వెంటనే దానిని తొలగించాడు, అతను పొరపాటున ఫార్వార్డ్ చేశాడని పోలీసులు తెలిపారు.


 

Updated Date - 2022-07-08T13:00:51+05:30 IST