Punjab రాష్ట్రంలో 10మంది మంత్రుల ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2022-03-19T17:13:54+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించాక శనివారం 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు....

Punjab రాష్ట్రంలో 10మంది మంత్రుల ప్రమాణస్వీకారం

చండీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించాక శనివారం 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణస్వీకారం చేశారు.అవినీతి రహిత పాలన అందిస్తామనే హామీతో ఆప్ ఎన్నికల్లో విజయం సాధించింది. శనివారం 10 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. చండీఘడ్ నగరంలోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో మంత్రులుగా డాక్టర్ దల్జీత్ కౌర్, హర్పాల్ సింగ్ చీమా, హర్బజన్ సింగ్, డాక్టర్ విజయ్ సింగ్లా, గుర్మిత్ సింగ్, బ్రామ్ శంకర్ జింపా,లాల్ చంద్ కటారుచక్,హరజోత్ సింగ్ బెయిన్స్, లాల్ జిత్ సింగ్ భుల్లార్, కుల్దీప్ సింగ్ ధలివాల్ లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.


 నిజాయితీ పాలన అందించడానికి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిని పంజాబ్ సీఎం మాన్ అభినందించారు.మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం మాన్ కుమార్తె శీరత్ కౌర్, కుమారుడు దిల్షాన్ మాన్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 


Read more