విమానాల్లో సమస్యలు

ABN , First Publish Date - 2022-07-07T08:37:14+05:30 IST

విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి.

విమానాల్లో సమస్యలు

18 రోజుల్లో స్పైస్‌జెట్‌కు చెందిన 8 విమానాల్లో సాంకేతిక లోపాలు

న్యూఢిల్లీ, జూలై 6: విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. గడిచిన 18 రోజుల్లో 8 స్పైస్‌జెట్‌ విమానాల్లో సమస్యలు తలెత్తాయి. అలాగే బుధవారం విస్తారా, ఇండిగో విమానాల్లోనూ ఇబ్బందులు కలిగాయి. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన విస్తారా విమానంలో ఒక ఇంజన్‌ సరిగ్గా పనిచేయలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానం దిగిన తర్వాత పైలట్లు సమస్యను గుర్తించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని విస్తారా  తెలిపింది. కాగా, రాయ్‌పూర్‌-ఇండోర్‌ మధ్య ఇండిగో విమాన సర్వీసులో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం ల్యాండైన తర్వాత ఇంజన్‌లో నుంచి పొగలు వచ్చాయి. విస్తారా, ఇండిగో సర్వీసుల్లో సమస్యలపై దర్యాస్తు చేస్తున్నట్టు డీజీసీఏ తెలిపింది. స్పైస్‌ జెట్‌ విమానాల్లో తరచూ సమస్యలు వస్తుండటంపై బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.

Read more