Ujjain Shri Mahakal Lok: ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2022-10-12T00:25:56+05:30 IST

భోపాల్: ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

Ujjain Shri Mahakal Lok: ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రారంభించిన మోదీ

భోపాల్: ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రధాని మహాకాళ్ మందిరంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు.



ఆ తర్వాత ప్రధాని మోదీ మహాకాళ్ లోక్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహాకాళ్ మందిరాన్ని విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు పాల్గొన్నారు. 





ఉజ్జయిని మహాకాళ్ కారిడార్‌ ప్రత్యేకతలివే 


మొత్తం 856 కోట్ల రూపాయల ఖర్చుతో కారిడార్ అభివృద్ధి  


దేశంలోనే అతి పెద్ద కారిడార్.. 900 మీటర్ల పొడవు  


పాత రుద్రసాగర్ చెరువు చుట్టూ కారిడార్ నిర్మాణం


శిల్పకళ ఉట్టిపడేలా 108 స్థంభాలు నిర్మాణం


50 కుడ్యచిత్రాల్లో శివపురాణం


మ్యూజికల్ ఫౌంటేన్ నిర్మాణం 


ఏకకాలంలో 2 లక్షల మంది దర్శించుకునే అవకాశం 







12 జ్యోతిర్లాంగాల్లో ఒకటైన ఉజ్జయిని మహాకాళ్ మందిరం వద్ద మహాకాళ్ కారిడార్ ప్రారంభమౌతున్న సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని వేలాది దేవాలయాలను సుందరంగా అలంకరించారు. దీపాలు వెలిగించారు. ప్రజలు కూడా తమ ఇళ్లలో దీపాలను వెలిగించారు. 

Updated Date - 2022-10-12T00:25:56+05:30 IST

Read more