128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం

ABN , First Publish Date - 2022-01-26T01:59:47+05:30 IST

2022 సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అవార్డు పొందిన వారి జాబితాను రాష్ట్రపతి భవనం మంగళవారం సాయంత్రం విడుదల

128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ: 2022 సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన 128 పద్మ అవార్డులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. అవార్డు పొందిన వారి జాబితాను రాష్ట్రపతి భవనం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. కాగా ఇందులో 4 పద్మవిభూషన్ అవార్డులు, 17 పద్మభూషన్ అవార్డులు, 107 పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. పద్మవిభూషన్‌ అవార్డుల్లో కళాకారులు ప్రభా ఆత్రే, ప్రముఖ సాహిత్యకారుడు రాధేశ్యామ్ కేంహ, జనరల్ బిపిన్ రావత్, కల్యాణ్ సింగ్‌లకు ఇవ్వనున్నారు. ఇందులో ప్రభా ఆత్రే మినహా మిగిలిన వారికి వారి మరణాంతరం ఈ అవార్డు లభిస్తోంది. ఇక పద్మభూషన్‌లో గులాంనబీ ఆజాద్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి ప్రముఖులు ఉన్నారు.


ఈ యేడాది వరించిన పద్మ అవార్డుల్లో ఏడుగురు తెలుగు వారు ఉన్నారు. అందులో నలుగురు తెలంగాణ నుంచి కాగా, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు.


తెలంగాణ


క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల - భారత్ బయోటెక్ (ఉమ్మడిగా)

దర్శనం మొగిలయ్య - కళలు

రామచంద్రయ్య - కళలు

పద్మజా రెడ్డి - కళలుఆంధ్రప్రదేశ్


గరికపాటి నర్సింహారావు - సాహిత్యం/విద్య

గోసవీడు షైక్ హుస్సేన్ - సాహిత్యం/విద్య

డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు - మెడిసిన్

Read more