bihar politics : బిహార్ పాలిటిక్స్‌పై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలివీ..

ABN , First Publish Date - 2022-08-10T21:52:06+05:30 IST

జేడీయూ(JDU) అధినేత నితీష్ కుమార్(Nitish Kumar) ఎన్‌డీఏ(NDA) నుంచి వైదొలగి ఆర్జేడీ(RJD), కాంగ్రెస్‌(Congress)‌లతో చేతులు కలిపి నూతనంగా ఏర్పాటు చేసిన

bihar politics : బిహార్ పాలిటిక్స్‌పై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలివీ..

న్యూఢిల్లీ : జేడీయూ(JDU) అధినేత నితీష్ కుమార్(Nitish Kumar) ఎన్‌డీఏ(NDA) నుంచి వైదొలగి ఆర్జేడీ(RJD), కాంగ్రెస్‌(Congress)‌లతో చేతులు కలిపి నూతనంగా ఏర్పాటు చేసిన ‘మహాఘట్‌బంధన్ 2.0’ ప్రభుత్వంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prasanth kumar) ఆసక్తికరంగా స్పందించారు.  రాజకీయ అస్థిరతలో నూతన అధ్యాయం మొదలైందన్నారు. బీజేపీ విషయంలో నితీష్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారని, ఈ కారణంగానే ఎన్‌డీఏ నుంచి వైదొలగారని అన్నారు. నితీష్ కుమార్, తేజశ్వి యాదవ్‌లను పునరేకీకరణ చేయడంలో తన పాత్రమీలేదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. మహాఘట్‌బంధన్‌ ప్రభుత్వ ఏర్పాటులో తన భాగస్వామ్యంలేదని తేల్చిచెప్పారు. నితీష్ కుమార్ రాజకీయ ప్రయాణం, బీహార్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, చోటు చేసుకుంటున్న మార్పులపై ‘ఇండియా టుడే’తో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు.


బిహార్‌లో గత 10 ఏళ్లలో ఇది 6వ ప్రభుత్వమని ప్రశాంత్ కిశోర్ గుర్తుచేశారు. ప్రస్తుత పరిణామాలను బట్టి రాజకీయ అస్థిరతలో నూతన అధ్యాయం బిహార్‌లో మొదలైనట్టేనని అన్నారు. ఈ రాజకీయ మార్పులో 2 అంశాలు యథావిథిగా ఉన్నాయన్నారు. ఒకటి నితీష్ కుమార్ సీఎంగానే ఉండగా.. బిహార్ దుర్భరస్థితి అలాగే కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ వేర్వేరు ప్రయోగాలు ప్రయత్నించారని చెప్పారు. ప్రభుత్వం ఏవిధంగా ఏర్పాటైనా తన అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. 


తేజశ్వి యాదవ్‌పై మాట్లాడుతూ.. ‘‘ లిక్కర్‌పై నిషేధించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్‌జేడీ నేత తేజశ్వి యాదవ్ చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. ఎలా వ్యవహరిస్తారు, ఏం చేస్తారనేది వేచిచూడాలి’’ అని ప్రశాంత్ కిశోర్ అన్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైతే నరేంద్ర మోదీకి పోటీగా నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారనే చర్చపై ప్రశాంత్ కిశోర్ స్పందించాడు. నితీష్ కుమార్ మనసులో ఏముందో తెలియదన్నారు. మోదీకి ఎవరు సవాలు విసరబోతున్నారమో తాను చెప్పలేనని అన్నారు.

Read more